icon icon icon
icon icon icon

మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు

ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్‌ వెరిఫియబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రైల్‌ (వీవీప్యాట్‌)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు.

Updated : 27 Apr 2024 06:38 IST

11 ఏళ్ల క్రితం తొలిసారి నాగాలాండ్‌లో వినియోగం

దిల్లీ: ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్‌ వెరిఫియబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రైల్‌ (వీవీప్యాట్‌)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. నాగాలాండ్‌లోని నోక్‌సేన్‌ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి వీవీప్యాట్లను వినియోగించారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రానికి ఓ బ్యాలట్‌ యూనిట్‌, మరో నియంత్రణ యూనిట్‌తో పాటు వీవీప్యాట్‌ యంత్రాన్ని అమర్చారు. దానికి ఉండే చిన్న బాక్స్‌లో ఏ అభ్యర్థికి ఓటు వేస్తే ఆ అభ్యర్తికి కేటాయించిన గుర్తు ఓటరుకు ఏడు సెకన్లు కనిపిస్తుంది. తరువాత అది దానికి అమర్చిన బాస్కెట్‌లో పడిపోతుంది. దేశంలో రహస్య ఓటింగ్‌ విధానం అమల్లో ఉన్నందున వీవీప్యాట్‌ స్లిప్‌ను ఓటరు తన వెంట తీసుకువెళ్లడం కుదరదు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఈవీఎంలతో పాటు ఆ స్లిప్‌లను 45 రోజుల పాటు స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరుస్తారు. ఎన్నికల ఫలితం వెలువడిన తరువాత దాన్ని సవాలు చేస్తూ ఎవరైనా 45 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించొచ్చు.

  • బ్యాలట్‌ యూనిట్‌తో కలిసి ఈవీఎంకు సుమారుగా రూ.7,900, నియంత్రణ యూనిట్‌కు రూ.9,800, వీవీప్యాట్‌ యంత్రానికి రూ.16,000 చొప్పున ఖర్చు అవుతుంది.
  • 2019 నుంచి ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి చెందిన అయిదు పోలింగ్‌ కేంద్రాల నుంచి ర్యాండమ్‌గా సేకరించిన వీవీప్యాట్లను ఈవీఎం లెక్కింపుతో సరిపోలుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ చాలా తక్కువ సందర్భాల్లోనే తేడా వచ్చినట్లు ఈసీ తెలిపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img