icon icon icon
icon icon icon

రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేరళలో ఎమ్మెల్యే అన్వర్‌పై కేసు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను కేరళలో ఎల్‌డీఎఫ్‌ ఎమ్మెల్యే పి.వి.అన్వర్‌పై కేసు నమోదైంది.

Published : 28 Apr 2024 04:49 IST

పాలక్కడ్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను కేరళలో ఎల్‌డీఎఫ్‌ ఎమ్మెల్యే పి.వి.అన్వర్‌పై కేసు నమోదైంది. పాలక్కడ్‌ జిల్లాలో ఈ నెల 22న ఎన్నికల ప్రచార సభలో అన్వర్‌ ప్రసంగిస్తూ.. ‘గాంధీ’ ఇంటిపేరుతో పిలిచేందుకు రాహుల్‌ అర్హుడు కాదన్నారు. ఆయన నాలుగో గ్రేడ్‌ పౌరుడని, ఆయన డీఎన్‌ఏను పరీక్షించాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై న్యాయవాది బైజూ నోయెల్‌ రొసారియో ఫిర్యాదు మేరకు నట్టుకల్‌ పోలీసు స్టేషన్‌లో అన్వర్‌పై శుక్రవారం కేసు నమోదైంది. భిన్న వర్గాల మధ్య వైరం పెంచేందుకు ప్రయత్నించడం, ఎన్నికలకు సంబంధించి శత్రుత్వాన్ని వ్యాప్తి చేయడం వంటి అభియోగాలను ఆయనపై మోపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img