icon icon icon
icon icon icon

ఈసారి ఓటు వేయలేకపోయా!

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో విడత పోలింగ్‌లో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఓటు వేయకపోవడం విమర్శలకు దారితీసింది.

Published : 28 Apr 2024 04:49 IST

తిరువనంతపురం భాజపా అభ్యర్థి,  కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో విడత పోలింగ్‌లో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఓటు వేయకపోవడం విమర్శలకు దారితీసింది. రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఓటు బెంగళూరులో ఉంది. ఈ రెండు స్థానాలకు ఏప్రిల్‌ 26నే పోలింగ్‌ జరిగింది. దీంతో తాను బరిలో ఉన్న స్థానంలో ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

‘‘ఎన్నికల వేళ తిరువనంతపురంలో ఉండడానికే  అధిక ప్రాధాన్యమిచ్చా. ఈసారి ఓటు వేయకపోవడం బాధనిపించింది. సరైన సమయంలో నా ఓటును ఇక్కడికి బదిలీ చేసుకోవడం సాధ్యపడలేదు.’’ అని రాజీవ్‌ వెల్లడించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని సీపీఎం, సీపీఐ నేతలు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img