icon icon icon
icon icon icon

ఎన్నికల బరిలో ఉజ్జ్వల్‌ నికమ్‌

మహారాష్ట్రలోని ముంబయి నార్త్‌ సెంట్రల్‌ లోక్‌సభ స్థానం సిటింగ్‌ ఎంపీ పూనమ్‌ మహాజన్‌ను భాజపా పక్కనపెట్టింది. ఆమె స్థానంలో ప్రముఖ న్యాయవాది ఉజ్జ్వల్‌ దేవ్‌రావ్‌ నికమ్‌ను బరిలో దింపింది.

Published : 28 Apr 2024 04:50 IST

ముంబయి నార్త్‌ సెంట్రల్‌ సిటింగ్‌ ఎంపీ పూనమ్‌ను తప్పించిన భాజపా

దిల్లీ: మహారాష్ట్రలోని ముంబయి నార్త్‌ సెంట్రల్‌ లోక్‌సభ స్థానం సిటింగ్‌ ఎంపీ పూనమ్‌ మహాజన్‌ను భాజపా పక్కనపెట్టింది. ఆమె స్థానంలో ప్రముఖ న్యాయవాది ఉజ్జ్వల్‌ దేవ్‌రావ్‌ నికమ్‌ను బరిలో దింపింది. ముంబయి ఉగ్రవాద దాడి(26/11) కేసులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించిన ఉజ్జ్వల్‌ న్యాయ వర్గాల్లో పేరున్న వ్యక్తి. 1993 నాటి ముంబయిలో వరుస బాంబు పేలుళ్ల కేసులోనూ ఆయన ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు. భాజపా దివంగత నేత ప్రమోద్‌ మహాజన్‌ కుమార్తె పూనమ్‌ మహాజన్‌. ఆమె 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ముంబయి నార్త్‌ సెంట్రల్‌ నుంచి ఎంపీగా గెలిచారు. పార్టీ పరంగా అందిన సమాచారాన్ని అనుసరించి ఆమెను పోటీ నుంచి తప్పించినట్లు భాజపా వర్గాల సమాచారం. ఆ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ధారావి ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్‌ రంగంలో ఉన్నారు. ఐదో దశలో భాగంగా ఇక్కడ మే 20న పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img