icon icon icon
icon icon icon

మోదీ అందించిన టీకాతోనే మనమంతా బతికున్నాం: ఫడణవీస్‌

కొవిడ్‌ కష్టకాలంలో ప్రధాని మోదీ దేశంలో టీకాల తయారీకి అనుమతించి, అందరికీ అందించడంతోనే నేడు భారతీయులంతా బతికున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు.

Published : 28 Apr 2024 04:51 IST

పుణె: కొవిడ్‌ కష్టకాలంలో ప్రధాని మోదీ దేశంలో టీకాల తయారీకి అనుమతించి, అందరికీ అందించడంతోనే నేడు భారతీయులంతా బతికున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. శనివారం  మహారాష్ట్రలోని సాంగ్లీ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. ఇలాగే దాదాపు వంద దేశాలకు మన వ్యాక్సిన్‌ డోసులను అందించి ఆయా ప్రాంతాల ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత మోదీకి చెందుతుందన్నారు. తాను ఇటీవల మారిషస్‌కు వెళ్లగా, వ్యాక్సిన్‌ డోసులను అందించి తమ దేశ ప్రజల జీవితాలను కాపాడిన మోదీకి కృతజ్ఞతలు చెప్పాలని ఆ దేశాధ్యక్షుడు తనను కోరినట్లు తెలిపారు. మోదీని ప్రజలు మళ్లీ ఆశీర్వదించడానికి ఈ ఒక్క కారణం చాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img