icon icon icon
icon icon icon

సునీతా కేజ్రీవాల్‌ తొలి రోడ్‌షో

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఆ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు.

Published : 28 Apr 2024 04:52 IST

తూర్పు దిల్లీలో ఆప్‌ అభ్యర్థి తరఫున ప్రచారం

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఆ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. ఆమె శనివారం తూర్పు దిల్లీ లోక్‌సభ స్థానంలో ఆప్‌ అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ తరఫున తొలి రోడ్‌షో నిర్వహించారు. వాహనంపై నిలుచున్న సునీత చేతులు జోడించి ఓటర్లకు అభివాదం చేస్తూ దిల్లీ వీధుల్లో ముందుకు సాగారు. దారిపొడవునా ప్రజలు భారీగా గుమిగూడారు. స్థానికులు భవనాలపైకి ఎక్కి ఆసక్తిగా తిలకించారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సింహం లాంటి వారని, ఆయనను ఎవరూ ఓడించలేరని సునీత పేర్కొన్నారు. పాఠశాలలు నిర్మించి, ఉచిత విద్యుత్‌ అందించి, మొహల్లా క్లినిక్‌లను తెరవడం వంటి ఎన్నో మంచి పనులు చేసినందుకే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, నియంత పాలనను గద్దె దింపడానికి ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జైలులో ఉన్న కేజ్రీవాల్‌ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడానికే ఆయనకు ఇన్సులిన్‌ నిలిపి వేశారని ఆరోపించారు. బెదిరింపులకు తన భర్త లొంగబోరని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img