icon icon icon
icon icon icon

తొలి రెండు దశల్లోనూ తగ్గిన పోలింగ్‌

లోక్‌సభ ఎన్నికల్లో తొలి రెండు దశల్లో పోలింగ్‌ 2019తో పోలిస్తే తక్కువగానే నమోదైంది. శుక్రవారం జరిగిన రెండో దశలో పోలింగ్‌ 66.7 శాతంగా అంచనా వేస్తున్నారు.

Published : 28 Apr 2024 04:53 IST

రెండోదశలో 66.7 శాతంగా ఈసీ అంచనా

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తొలి రెండు దశల్లో పోలింగ్‌ 2019తో పోలిస్తే తక్కువగానే నమోదైంది. శుక్రవారం జరిగిన రెండో దశలో పోలింగ్‌ 66.7 శాతంగా అంచనా వేస్తున్నారు. శుక్రవారం పోలింగ్‌ పూర్తయ్యాక రాత్రివరకు అందిన సమాచారం ఆధారంగా సుమారు 63.5% మంది ఓటువేసి ఉంటారని తెలిపిన ఎన్నికల సంఘం శనివారం సయితం పూర్తి సమాచారాన్ని లాంఛనంగా వెల్లడించలేదు. 2019 ఎన్నికల్లో రెండో దశలో 95 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. అప్పుడు 69.64 శాతం పోలయింది. ఈసారి 88 నియోజకవర్గాల సగటు అంతకంటే తక్కువేనని తేలుతోంది. మొదటి దశ వరకు చూసినా- 2019లో 69.43% అయితే ఈసారి 65.5% మాత్రమే. ఎండల వేడి, పెళ్లిళ్ల తాకిడి వల్ల తొలి రెండు దశల్లోనూ పోలింగ్‌ తగ్గి ఉంటుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img