icon icon icon
icon icon icon

రిజర్వేషన్లు లాగేసుకోవడమే భాజపా లక్ష్యం: రాహుల్‌

రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే భాజపా నేతల లక్ష్యమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.

Published : 28 Apr 2024 04:53 IST

దిల్లీ: రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే భాజపా నేతల లక్ష్యమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. వారి వ్యాఖ్యలతోనే ఈ విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ‘‘భాజపా నేతల మాటలు, ప్రధాని మోదీతో సన్నిహితంగా ఉండేవారి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం; దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలవారి రిజర్వేషన్లను లాగేసుకోవడమే వారి లక్ష్యమని స్పష్టంగా అర్థమవుతోంది. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను భాజపా బారి నుంచి పరిరక్షించేందుకు కాంగ్రెస్‌ గట్టిగా నిలబడి ఉంది. మా పార్టీ ఉన్నంతవరకూ ప్రపంచంలోని ఏ శక్తీ అణగారిన వర్గాల రిజర్వేషన్లను లాగేసుకోవడం సాధ్యం కాదు’’ అని ‘ఎక్స్‌’ వేదికగా రాహుల్‌ శనివారం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img