icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. డీపీసీసీ పదవికి అర్విందర్‌ లవ్లీ రాజీనామా

లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో జతకలిసి హస్తిన పీఠం దక్కించుకోవాలని చూస్తోన్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్‌ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు.

Published : 29 Apr 2024 03:56 IST

వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని వెల్లడి

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో జతకలిసి హస్తిన పీఠం దక్కించుకోవాలని చూస్తోన్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్‌ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఆప్‌తో పొత్తు కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అసత్య, కల్పిత, దురుద్దేశ అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్‌ను నాశనం చేయడానికే ఆప్‌ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన రోజున తనకు ఇష్టం లేకపోయినా అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. తాను డీపీసీసీ అధ్యక్షుడిగా మాత్రమే రాజీనామా చేశానని ఏ పార్టీలో చేరడం లేదని ఆదివారమిక్కడ మీడియా సమావేశంలో అర్విందర్‌ స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img