icon icon icon
icon icon icon

ఒడిశాలో ఈసారి సర్కారు మార్పు

ఒడిశా ఉనికి, భాషాసాహిత్యాలు సంక్షోభంలో ఉన్నాయని.. బిజూ జనతాదళ్‌ (బిజద) ఏలుబడిలో రాష్ట్ర పరిస్థితులు మరింత దిగజారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ పరిస్థితిని ఇక ఎంతమాత్రం సహించబోరని, ఒడిశాకు సేవ చేసే అవకాశం భాజపాకు రావాలన్నారు.

Published : 29 Apr 2024 03:58 IST

ప్రధాని మోదీ

భువనేశ్వర్‌: ఒడిశా ఉనికి, భాషాసాహిత్యాలు సంక్షోభంలో ఉన్నాయని.. బిజూ జనతాదళ్‌ (బిజద) ఏలుబడిలో రాష్ట్ర పరిస్థితులు మరింత దిగజారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ పరిస్థితిని ఇక ఎంతమాత్రం సహించబోరని, ఒడిశాకు సేవ చేసే అవకాశం భాజపాకు రావాలన్నారు. ఈ మేరకు ఓ న్యూస్‌ ఛానల్‌కు ప్రధాని ఇచ్చిన ఇంటర్వ్యూ భాగాన్ని భాజపా ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది. ఈసారి ఒడిశా సర్కారులో మార్పు ఉంటుందని ప్రధాని అన్నారు. ఈ రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు సమాంతరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఒడిశా ఉద్యమ రూపశిల్పి ‘ఉత్కళ్‌ గౌరవ్‌’ మధుసూదన్‌ దాస్‌ 176వ జయంతి సందర్భంగా ఆదివారం రాష్ట్రంలో ‘స్వాభిమాన్‌ దివస్‌’ జరుపుకొంటున్న నేపథ్యంలో ప్రధాని ఇంటర్వ్యూ క్లిప్పింగును భాజపా షేర్‌ చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img