icon icon icon
icon icon icon

251 సార్లు జైలుకెళ్లిన నేత.. రాజ్‌నాథ్‌తో ఢీ!

ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఆయన ఏకంగా 251సార్లు జైలుకెళ్లారు. విద్యార్థి నాయకుడిగా మొదలైన తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.

Published : 29 Apr 2024 03:59 IST

లఖ్‌నవూ: ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఆయన ఏకంగా 251సార్లు జైలుకెళ్లారు. విద్యార్థి నాయకుడిగా మొదలైన తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఏకంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో సార్వత్రిక సమరంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా తలపడుతున్నారు. ఆయనే- రవిదాస్‌ మెహ్రోత్రా. రవిదాస్‌ తొలిసారి 1989లో లఖ్‌నవూ తూర్పు స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో లఖ్‌నవూ సెంట్రల్‌ స్థానంలో విజయం సాధించారు. అఖిలేశ్‌ యాదవ్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2022లో మరోసారి గెలుపొందారు. అనేకసార్లు జైలుకు వెళ్లి రావడంపై రవిదాస్‌ మాట్లాడుతూ.. ‘‘నాపై ఉన్న కేసులన్నీ యూనివర్సిటీ రోజుల్లో, తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక చేపట్టిన ప్రదర్శనలు, నిరసనలకు సంబంధించినవే. ఇప్పటిదాకా నాపై ఒక్క క్రిమినల్‌ కేసు కూడా నమోదు కాలేదు. నేను ఓ పోరాట యోధుడిననే విషయాన్ని ఈ కేసుల గణాంకాలే చెబుతాయి’’ అని అన్నారు. రాజ్‌నాథ్‌పై పోటీ గురించి స్పందిస్తూ.. ‘‘ప్రజల ముందు మహామహా యోధులే తలలు వంచారు. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img