icon icon icon
icon icon icon

నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి

నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

Published : 29 Apr 2024 04:14 IST

సునీతా కేజ్రీవాల్‌ పిలుపు

దిల్లీ: నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ దిల్లీ నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి మహాబల్‌ మిశ్రకు మద్దతుగా ఆదివారం ఆమె ప్రచారం నిర్వహించారు. కేజ్రీవాల్‌ను సింహంతో ఆమె పోల్చారు. ఆయన ఎవరికీ తల వంచరని పేర్కొన్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని భరతమాత బిడ్డగా తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కాగా తిహాడ్‌ కారాగారంలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను సోమవారం కలిసేందుకు సునీతకు జైలు అధికార వర్గాలు అనుమతి నిరాకరించాయని ఆప్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img