icon icon icon
icon icon icon

దేశ గమనాన్ని నిర్దేశించే ఎన్నికలివి

రాజ్యాంగంలో మార్పులు చేసేందుకే లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలవాలని భాజపా భావిస్తోందని ఎన్సీపీ(శరద్‌ పవార్‌ వర్గం)అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Updated : 29 Apr 2024 06:53 IST

భాజపాను ఓడిస్తేనే ప్రజాస్వామ్యం భద్రం : పవార్‌

పుణె: రాజ్యాంగంలో మార్పులు చేసేందుకే లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలవాలని భాజపా భావిస్తోందని ఎన్సీపీ(శరద్‌ పవార్‌ వర్గం)అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. బారామతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సాస్వాద్‌లో ఆయన ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవార్‌ మాట్లాడుతూ.. ‘ఈ సార్వత్రిక ఎన్నికలు మునుపటి ఎన్నికల కంటే భిన్నమైనవి. ఎందుకంటే ఇవి దేశ గమనాన్ని నిర్దేశించబోతున్నాయి. దేశంలో ప్రజాస్వామ్య విధానం ఉండాలి. కానీ భాజపా తమకు 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో మార్పులు చేయాలని భావిస్తోంది. అది ఆందోళనకరం’ అని పేర్కొన్నారు. ‘దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. భాజపా నేతలు నియంతృత్వంతో వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే వారిని ఓడించాలి’ పవార్‌ పిలుపునిచ్చారు. ఆయన కుమార్తె సుప్రియ సూలే బారామతి నుంచి బరిలోకి దిగారు. ఆమె మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ భార్య సునేత్రా పవార్‌తో పోటీపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img