icon icon icon
icon icon icon

ప్రజ్వల్‌ రేవణ్ణపై ఇంకా మౌనమేనా మోదీజీ!

మహిళలపై దురాగతాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై ప్రధాని మోదీ ఇంకా మౌనంగానే ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు.

Updated : 30 Apr 2024 22:51 IST

ప్రియాంకా గాంధీ

కలబురగి: మహిళలపై దురాగతాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై ప్రధాని మోదీ ఇంకా మౌనంగానే ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ప్రజ్వల్‌ దేశం విడిచి ఎలా వెళ్లగలిగారని నిలదీశారు. సోమవారం కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని సెడంలో ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ప్రజ్వల్‌ భుజంమీద చేయివేసి ప్రధాని ఫొటో దిగారు. 10 రోజుల కిందట స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన విదేశాలకు పారిపోయారు. ఎందరో మహిళల జీవితాలు నాశనయయ్యాయి. ఇప్పుడు కూడా మోదీ మౌనంగా ఉంటారా..?’’ అని ఆమె నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img