icon icon icon
icon icon icon

ప్రధానిగా రాహుల్‌ ప్రమాణం.. ఏఐ ఆడియో క్లిప్‌ వైరల్‌

‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న వీడియోలు, ఆడియోలు ఇటీవల కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సంబంధించి ఆడియో క్లిప్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది.

Updated : 30 Apr 2024 22:44 IST

దిల్లీ: ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న వీడియోలు, ఆడియోలు ఇటీవల కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సంబంధించి ఆడియో క్లిప్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్నట్లు అందులోని మాటలను బట్టి తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా సంగీతం, దిల్లీలోని ఎర్రకోట దృశ్యాలను జత చేసి.. హస్తం పార్టీ మద్దతుదారులు దానిని షేర్‌ చేశారు. ‘‘ఆ రోజు త్వరలో రానుంది. జూన్‌ 4న రాహుల్‌ ప్రధాని అవుతారు’’ అన్న ఆ వ్యాఖ్యను ఆడియో క్లిప్‌నకు జతచేశారు. సార్వత్రిక ఎన్నికల ఓటింగ్‌ జరుగుతోన్న సమయంలో ఈ ఆడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడం గమనార్హం. కొన్ని డిటెక్షన్‌ టూల్స్‌ దానిని ఏఐ వాయిస్‌ క్లోన్‌ అని నిర్ధారించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img