icon icon icon
icon icon icon

రాజ్యాంగం, రిజర్వేషన్లకు భాజపా, ఆరెస్సెస్‌లు వ్యతిరేకం

పేదల హక్కులకు, భవిష్యత్తుకు భరోసా ఇస్తోన్న రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మార్చివేసి, రద్దు చేయాలన్నది భాజపా, ఆరెస్సెస్‌ల ఆలోచన అని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Updated : 30 Apr 2024 22:44 IST

బిలాస్‌పుర్‌ సభలో రాహుల్‌

బిలాస్‌పుర్‌: పేదల హక్కులకు, భవిష్యత్తుకు భరోసా ఇస్తోన్న రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మార్చివేసి, రద్దు చేయాలన్నది భాజపా, ఆరెస్సెస్‌ల ఆలోచన అని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అప్రమత్తమయ్యారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దేవేంద్ర యాదవ్‌ తరఫున సోమవారం నిర్వహించిన సభలో రాహుల్‌ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని భాజపా, ఆరెస్సెస్‌ కంకణం కుట్టుకుంటే దానిని పరిరక్షించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని వివరించారు.  కొందరు భాజపా నేతలు రాజ్యాంగాన్ని మార్చేస్తామని బాహాటంగానే చెబుతున్నారని గుర్తు చేశారు.   రెండు దశల పోలింగ్‌ అనంతరం భాజపా నేతలు 400 స్థానాల్లో విజయం గురించి ఎందుకు మాట్లాడడంలేదని రాహుల్‌  ప్రశ్నించారు. గుజరాత్‌లోని పాటన్‌ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల సభలోనూ కాంగ్రెస్‌ అగ్రనేత ప్రసంగించారు. అధికారంలోకి రాగానే కుల గణనను నిర్వహిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img