icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌కు ఇందౌర్‌ అభ్యర్థి షాక్‌

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ లోక్‌సభ స్థానంలో హస్తం పార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బమ్‌ అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగారు. చివరి నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడమే గాక.. పార్టీని వీడారు.

Updated : 30 Apr 2024 22:48 IST

నామినేషన్‌ను వెనక్కి తీసుకున్న అక్షయ్‌ కాంతి బమ్‌

ఇందౌర్‌: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ లోక్‌సభ స్థానంలో హస్తం పార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బమ్‌ అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగారు. చివరి నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడమే గాక.. పార్టీని వీడారు. ఆయన భాజపాలో చేరనున్నట్లు కమలం పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందౌర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారమే చివరి రోజు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్‌ పత్రాలను వెనక్కి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img