icon icon icon
icon icon icon

స్పందించేందుకు సమయం కావాలి

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి తమ పార్టీల అధ్యక్షులకు అందిన నోటీసులపై స్పందించేందుకు మరింత సమయం కావాలని ఎన్నికల కమిషన్‌ను భాజపా, కాంగ్రెస్‌ కోరాయి.

Updated : 30 Apr 2024 22:35 IST

ఈసీని కోరిన భాజపా, కాంగ్రెస్‌

దిల్లీ: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి తమ పార్టీల అధ్యక్షులకు అందిన నోటీసులపై స్పందించేందుకు మరింత సమయం కావాలని ఎన్నికల కమిషన్‌ను భాజపా, కాంగ్రెస్‌ కోరాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీలకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై ఈ నెల 29న ఉదయం 11 గంటల్లో స్పందించాలంటూ భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఖర్గేలను ఈసీ కోరింది. ఈ క్రమంలో తమ స్పందనను తెలియచేయడానికి భాజపా ఓ వారం సమయం కోరినట్లు ఈసీ తెలిపింది. కాంగ్రెస్‌ 14 రోజుల సమయం కోరింది. అయితే ఆ పార్టీ అభ్యర్థనలను ఈసీ మన్నించిందా? లేదా అనే విషయం తెలియరాలేదు.

ఈసీతో సీపీఎం బృందం భేటీ

మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, అసత్యాల వ్యాప్తిపై భాజపాకు వ్యతిరేకంగా తాము చేసిన ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై చర్చించేందుకు ఎన్నికల కమిషన్‌ సభ్యులతో సీపీఎం బృందం సోమవారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చినట్లు సీపీఎం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img