icon icon icon
icon icon icon

పేదలకే ఎక్కువమంది పిల్లలను కనే సత్తా : ఖర్గే

‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరెత్తితే అల్పసంఖ్యాకులు, పేదల గురించి మాట్లాడుతుంటారు. దేశంలోని ఆస్తులను పిల్లలు ఎక్కువగా ఉండేవారికి పంచుతారంటూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తుంటారు.

Updated : 01 May 2024 05:26 IST

ఈనాడు, బెంగళూరు: ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరెత్తితే అల్పసంఖ్యాకులు, పేదల గురించి మాట్లాడుతుంటారు. దేశంలోని ఆస్తులను పిల్లలు ఎక్కువగా ఉండేవారికి పంచుతారంటూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తుంటారు. ఎక్కువమంది పిల్లలను కనే సామర్థ్యం పేదలకే ఉంటుంది’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి కలబురగి జిల్లాలోని వాడిలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ పేద కుటుంబాన్ని చూసినా నలుగురైదుగురు పిల్లలుంటారని చెప్పారు. ‘‘ఏం చేద్దాం.. అధిక సంతానం పుట్టించే సామర్థ్యం వారికే ఉంది. ఆ సత్తా మీకు లేదంటే అందుకు మేమేం చేసేది’’ అంటూ మోదీ విమర్శలకు బదులిచ్చారు. ఈ దేశాన్ని నిర్మించటంలో పేదల శ్రమ ఉందని గుర్తుచేశారు. మోదీకి పేదలు, అల్పసంఖ్యాకులంటే గిట్టదన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, భాజపా ఎంపీలు బహిరంగంగానే చెబుతుంటారని ఖర్గే తెలిపారు. ‘‘రాజ్యాంగం కేవలం రిజర్వేషన్ల కోసమే రచించింది కాదు. అది దేశంలో ప్రతి వ్యవస్థను నడిపించే ఓ పెద్ద గ్రంథం. ఎన్నికల సమయంలో తప్పుడు హామీలిచ్చే భాజపా కాకుండా హామీలు నెరవేర్చే కాంగ్రెస్‌తోనే దేశ ప్రగతి సాధ్యం’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img