icon icon icon
icon icon icon

తొలివిడతలో 66.14 %

తొలి, రెండో విడతల పోలింగ్‌ తుది వివరాలు వెల్లడయ్యాయి. తొలి విడతలో 66.14%, రెండో విడతలో 66.71 శాతం పోలింగ్‌ నమోదైంది.

Published : 01 May 2024 04:03 IST

రెండోవిడతలో 66.71%
పోలింగ్‌ వివరాలను విడుదల చేసిన ఎన్నికల సంఘం

దిల్లీ: తొలి, రెండో విడతల పోలింగ్‌ తుది వివరాలు వెల్లడయ్యాయి. తొలి విడతలో 66.14%, రెండో విడతలో 66.71 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ శాతాల వెల్లడిలో జాప్యంపై కాంగ్రెస్‌, సీపీఎం, తృణమూల్‌ ప్రశ్నించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం అధికారికంగా తుది వివరాలను ప్రకటించింది. తొలి విడత పోలింగ్‌ ముగిసిన 11 రోజుల తర్వాత తుది వివరాలను ఈసీ వెల్లడించడం గమనార్హం.

  •   తొలి విడతలో 66.22 శాతం మంది పురుషులు, 66.07 శాతం మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ట్రాన్స్‌జెండర్లలో 31.32 శాతం మంది ఓటు వేశారు.
  • 2019లో తొలి విడతలో 69.43 శాతం పోలింగ్‌ నమోదైంది.
  • రెండో విడతలో 66.99 శాతం మంది పురుషులు, 66.42 శాతం మంది మహిళలు ఓటు వేశారు. ట్రాన్స్‌జెండర్లలో 23.86శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • 2019లో రెండో విడతలో 69.64శాతం పోలింగ్‌ నమోదైంది.
  • తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్‌ జరగ్గా 11 చోట్ల మహిళలే ఎక్కువగా ఓటేశారు. అవి.. అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, మణిపుర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌.
  • రెండో విడతలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్‌ జరిగింది. ఇందులో 6 చోట్ల మహిళల ఓటింగ్‌ శాతం అధికంగా ఉంది. అవి.. అస్సాం, బిహార్‌, జమ్మూ కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img