icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ విభజన వాదాన్ని ప్రజల్లో ఎండగట్టండి

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ కోటాను లాక్కొని తన ఓటుబ్యాంకు వర్గానికి కట్టబెట్టాలని చూస్తున్న కాంగ్రెస్‌ ఉద్దేశాన్ని ప్రజల్లో ఎండగట్టాలని సూచిస్తూ భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి లోక్‌సభ అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా వ్యక్తిగత లేఖలు రాశారు.

Published : 01 May 2024 04:06 IST

ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని లేఖ

దిల్లీ: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ కోటాను లాక్కొని తన ఓటుబ్యాంకు వర్గానికి కట్టబెట్టాలని చూస్తున్న కాంగ్రెస్‌ ఉద్దేశాన్ని ప్రజల్లో ఎండగట్టాలని సూచిస్తూ భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి లోక్‌సభ అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా వ్యక్తిగత లేఖలు రాశారు. మతప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ.. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు విభజనవాద, వివక్షపూరిత ఆలోచనలు కలిగి ఉన్నాయని మోదీ ఆరోపించారు. పేదల కష్టార్జితాన్ని తీసుకువెళ్లి ఓటుబ్యాంకు వర్గాలకు ఇస్తామని, వారసత్వ పన్నును తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారన్నారు. భాజపా అభ్యర్థిగా తాను ప్రతి క్షణాన్ని పౌరుల సంక్షేమం కోసం అంకితం చేస్తాననే హామీని ప్రతి ఓటరుకు చేరవేయాలన్నారు. అదేవిధంగా.. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయాన్నే పోలింగు కేంద్రాలకు తరలివచ్చేలా ఓటర్లను ప్రోత్సహించాలని పార్టీ శ్రేణులకు మోదీ సూచించారు.

అమిత్‌ షాపై ప్రశంసల జల్లు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో ఆయన్ను అత్యంత విలువైన పార్టీ కార్యకర్తగా మోదీ ప్రశంసించారు. గుజరాత్‌లోనూ, కేంద్రంలోనూ విజయవంతమైన మంత్రిగా నిరూపించుకొన్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన 13వ ఏట అమిత్‌ షా ప్రజాజీవితాన్ని ప్రారంభించారని, 1980ల నుంచి తమ అనుబంధం కొనసాగుతోందని గుర్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img