icon icon icon
icon icon icon

అమేఠీ, రాయ్‌బరేలీల్లో కొనసాగుతున్న ఉత్కంఠ

ఉత్తర్‌ప్రదేశ్‌లో గాంధీల కుటుంబానికి కంచుకోటల్లాంటి అమేఠీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఎవరు బరిలో దిగుతారనేదానిపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది.

Published : 01 May 2024 04:07 IST

 ఇంకా ఖరారు కాని కాంగ్రెస్‌ అభ్యర్థులు
నామినేషన్ల దాఖలుకు 3 వరకే గడువు

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో గాంధీల కుటుంబానికి కంచుకోటల్లాంటి అమేఠీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఎవరు బరిలో దిగుతారనేదానిపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఈ రెండు స్థానాల్లో మే 20న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు 3వ తేదీ వరకే గడువుంది. అయితే ఇప్పటికీ హస్తం పార్టీ వాటికి అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో అమేఠీలో కాంగ్రెస్‌ కార్యకర్తలు మంగళవారం ధర్నాకు దిగారు. కాంగ్రెస్‌ అగ్రనేతలైన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రాల్లో ఒకరిని తమ నియోజకవర్గంలో బరిలో దింపాలని డిమాండ్‌ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం- రాయ్‌బరేలీలో పోటీ చేసేందుకు ప్రియాంకాగాంధీ సుముఖంగా ఉన్నారు. రాహుల్‌ మాత్రం అమేఠీలో బరిలో దిగడంపై ఇంకా ఎటూ తేల్చలేదు. ప్రియాంకను రాయ్‌బరేలీలో, రాహుల్‌ను అమేఠీలో పోటీ చేయించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పటికే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని కోరింది. కమిటీ కూడా వారి వినతికి శనివారం మద్దతు పలికింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img