icon icon icon
icon icon icon

అనంత్‌నాగ్‌-రాజౌరీ ఎన్నిక మే 25కు వాయిదా

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏర్పాట్లు కష్టమయ్యేలా ఉండడంతో జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌-రాజౌరీ లోక్‌సభ స్థానంలో ఎన్నికలను మే 25వ తేదీకి వాయిదా వేయాలని ఈసీ మంగళవారం నిర్ణయించింది.

Published : 01 May 2024 04:08 IST

దిల్లీ: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏర్పాట్లు కష్టమయ్యేలా ఉండడంతో జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌-రాజౌరీ లోక్‌సభ స్థానంలో ఎన్నికలను మే 25వ తేదీకి వాయిదా వేయాలని ఈసీ మంగళవారం నిర్ణయించింది. ఎన్నికల తేదీ మినహా షెడ్యూల్‌లో మరేమీ మారదని ఈసీ వర్గాలు స్పష్టంచేశాయి. ముందు ప్రకటించిన ప్రకారమైతే మే 7న అక్కడ ఎన్నికలు జరగాలి. మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా 20 మంది బరిలో ఉన్నారు. హిమపాతంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున ఎన్నికల తేదీ మార్చాలని వివిధ పార్టీలు కోరడంతో ఈసీ తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నిర్ణయాన్ని పీడీపీ తప్పుబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img