icon icon icon
icon icon icon

దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా దేవేందర్‌ యాదవ్‌

దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(డీపీసీసీ) తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే దేవేందర్‌ యాదవ్‌ను కాంగ్రెస్‌ నియమించింది. ఈ విషయాన్ని పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 01 May 2024 05:40 IST

దిల్లీ: దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(డీపీసీసీ) తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే దేవేందర్‌ యాదవ్‌ను కాంగ్రెస్‌ నియమించింది. ఈ విషయాన్ని పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఏఐసీసీ పంజాబ్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న దేవేందర్‌ యాదవ్‌ డీపీసీసీ బాధ్యతలు సైతం నిర్వహించనున్నారని పేర్కొంది. తన నియామకంపై స్పందించిన దేవేందర్‌.. అధిష్ఠానానికి తనపై ఉన్న నమ్మకానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఆప్‌తో పొత్తును వ్యతిరేకిస్తూ అర్విందర్‌ సింగ్‌ లవ్లీ డీపీసీసీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img