icon icon icon
icon icon icon

యువ ఓటర్ల చైతన్యానికి మ్యూజికల్‌ బ్యాండ్ల ఏర్పాటు

యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు హరియాణా వినూత్న చర్య చేపట్టింది.

Published : 01 May 2024 05:41 IST

 హరియాణా సరికొత్త పంథా

చండీగఢ్‌: యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు హరియాణా వినూత్న చర్య చేపట్టింది. ఓటు ఆవశ్యకతను తెలియజేసే పాటలతో యువతను చైతన్యవంతులను చేసేలా ప్రత్యేక మ్యూజిక్‌ బ్యాండ్లతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి అనురాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. యువ ఓటర్లు అధికంగా ఉన్న జిల్లాల్లో ఈ బ్యాండ్లను ఏర్పాటు చేసి ఓటేసేలా వారిలో జోష్‌ నింపుతామని తెలిపారు. దీంతోపాటు ‘ఓటర్స్‌ ఇన్‌ క్యూ’ అనే యాప్‌ను రూపొందించి వివాహ ఆహ్వానాల మాదిరిగా ఓటర్లకు పోలింగ్‌ ఆహ్వానాలు పంపుతున్నామని, ఈ యాప్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రం వద్ద రద్దీ, ఓటేయడానికి అనుకూలమైన సమయం తదితర సమాచారాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. హరియాణాలో 10 ఎంపీ స్థానాలకు మే 25న ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img