icon icon icon
icon icon icon

మాకు 400+ స్థానాలు ఖాయం

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 400 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు.

Published : 01 May 2024 05:44 IST

‘ఈటీవీ భారత్‌’తో అమిత్‌షా

గువాహటి: లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 400 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. భాజపాకి లభిస్తోన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే కృత్రిమ వీడియోలను విపక్షాలు వ్యాప్తిలోకి తీసుకువస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకున్నట్లు ఆరోపించారు. మంగళవారం గువాహటిలో ఆయన ‘ఈటీవీ భారత్‌’తో మాట్లాడారు. దేశవ్యాప్తంగా భాజపా ప్రభంజనం ఉందని, ప్రతిపక్షాలు ఎంత గందరగోళం చేయాలని చూసినా, భాజపా 400+ సీట్లు గెలవబోతుందని చెప్పారు. ‘‘ఎన్నికల్లో విపక్షాలకు ఘోర పరాభవం తప్పదు. ఆ విషయం వారికీ తెలుసు. అందుకే చౌకబారు వ్యూహాలకు పాల్పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కృషి ఫలితంగానే అస్సాం ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా తిరగ్గలుగుతున్నారు. ప్రతిపక్షాల మద్దతుదారులు ఇప్పటికే నిరాశలో కూరుకుపోయారు. ఇంట్లోనే ఉండడానికి వారు ఇష్టపడుతున్నారు. భాజపాకి మద్దతునిచ్చే ఓటర్లు మాత్రమే ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు. మిగిలిన ఐదు దశల్లోనైనా అందరూ బయటకు వచ్చి ఓటువేయాలి. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళలో కూడా మా పార్టీ మంచి పనితీరు కనబరుస్తుంది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img