icon icon icon
icon icon icon

అమిత్‌ షా నకిలీ వీడియో కేసు.. ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడికి సమన్లు

రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను వక్రీకరించి నకిలీ వీడియోను వ్యాప్తి చేసిన కేసులో దిల్లీ పోలీసులు ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజేశ్‌ ఠాకుర్‌కు సమన్లు జారీ చేశారు.

Published : 02 May 2024 02:50 IST

రాంచీ: రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను వక్రీకరించి నకిలీ వీడియోను వ్యాప్తి చేసిన కేసులో దిల్లీ పోలీసులు ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజేశ్‌ ఠాకుర్‌కు సమన్లు జారీ చేశారు. ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌(ఐఎఫ్‌ఎస్‌వో) కార్యాలయంలో ఈ నెల 2న(గురువారం) విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. సమన్లపై రాజేశ్‌ ఠాకుర్‌ స్పందిస్తూ ‘‘దిల్లీ పోలీసులు నాకు నోటీసు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు. ఏదైనా ఫిర్యాదు ఉంటే ముందుగా నా ‘ఎక్స్‌’ ఖాతాలోని సమాచారాన్ని పరిశీలించాలి. ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరిన తరుణంలో నేను క్షేత్రస్థాయిలో ఉండడం అవసరం. ఈ పరిస్థితుల్లో నా ల్యాప్‌టాప్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు కావాలని కోరారు. ఎలాంటి ధ్రువీకరణ చేసుకోకుండా నాకు సమన్లు పంపడం సరికాదు. ఈ విషయంలో న్యాయసలహా తీసుకుంటాను’’ అని చెప్పారు. అమిత్‌ షా రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారంటూ ఏప్రిల్‌ 28న దిల్లీ పోలీస్‌ ప్రత్యేక విభాగం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇదే వ్యవహారానికి సంబంధించి నకిలీ వీడియోను వ్యాప్తి చేశారని ఝార్ఖండ్‌ భాజపా ఫిర్యాదు మేరకు రాంచీలోని అర్గోరా పోలీసులు ఇద్దరిపై కేసునమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img