icon icon icon
icon icon icon

భాజపాలో చేరిన నటి రూపాలి గంగూలీ, జోతిష్యుడు అమేయా జోషీ

ప్రముఖ బుల్లితెర నటి రూపాలి గంగూలీ, మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త, జోతిష్యుడు అమేయా జోషీ భాజపాలో చేరారు.

Published : 02 May 2024 04:37 IST

దిల్లీ: ప్రముఖ బుల్లితెర నటి రూపాలి గంగూలీ, మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త, జోతిష్యుడు అమేయా జోషీ భాజపాలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే, జాతీయ మీడియా విభాగం ఇన్‌ఛార్జ్‌ అనిల్‌ బలూని సమక్షంలో బుధవారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో వారు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తావ్డే మాట్లాడుతూ.. ‘‘అబద్ధాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష కూటమి, ఇప్పుడు ‘ఓట్‌ జిహాద్‌’ ప్రచారాన్ని మొదలెట్టింది. ఓ వైపు వారు ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లను కల్పిస్తూ.. మరోవైపు ఓట్‌ జిహాద్‌ గురించి మాట్లాడుతున్నారు’’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img