icon icon icon
icon icon icon

వారణాసిలో మోదీపై మిమిక్రీ కళాకారుడి పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వారణాసి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీ చేయనున్నట్లు మిమిక్రీ కళాకారుడు, కమెడియన్‌ శ్యామ్‌ రంగీలా(29) ప్రకటించారు.

Published : 02 May 2024 04:37 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వారణాసి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీ చేయనున్నట్లు మిమిక్రీ కళాకారుడు, కమెడియన్‌ శ్యామ్‌ రంగీలా(29) ప్రకటించారు. రాజస్థాన్‌కు చెందిన ఆయన ప్రధాని మోదీ గొంతును అనుకరిస్తూ మిమిక్రీ చేయడంతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యారు. ఈ సందర్భంగా శ్యామ్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పటికీ దేశంలో ప్రజాస్వామ్యం జీవించే ఉందని తెలియజేయడానికే ప్రధానిపై పోటీకి దిగుతున్నాను’’ అని పేర్కొన్నారు. నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయడానికి ఈ వారాంతంలో ఆయన వారణాసి చేరుకోనున్నారు. వారణాసి నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ప్రధాని మోదీ మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తానని దీమాగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img