icon icon icon
icon icon icon

ప్రజాక్షేత్రంలో శివసేనలకు పరీక్ష

శివసేన పార్టీల మధ్య కీలక పోరు ముంబయిలో జరగనుంది. ఇక్కడి మొత్తం 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల రెండు శివసేనలే ముఖాముఖి తలపడుతున్నాయి.

Published : 02 May 2024 04:38 IST

ప్రజల మద్దతు ఎవరికో తేల్చనున్న ముంబయి
మొత్తం 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల ముఖాముఖి

ముంబయి: శివసేన పార్టీల మధ్య కీలక పోరు ముంబయిలో జరగనుంది. ఇక్కడి మొత్తం 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల రెండు శివసేనలే ముఖాముఖి తలపడుతున్నాయి. ఏక్‌నాథ్‌ శిందే, ఉద్ధవ్‌ ఠాక్రేలకు ఇది ఒక రకంగా పరీక్షే. అధికారికంగా శివసేనను శిందే వర్గం దక్కించుకున్నా ప్రజా క్షేత్రంలో ఎవరికి మద్దతుందో ఈ ఎన్నికల ద్వారా తేలనుంది. మిగిలిన 3 నియోజకవర్గాల్లో రెండు చోట్ల భాజపా, కాంగ్రెస్‌ మధ్య, మరో చోట శివసేన (ఉద్ధవ్‌), భాజపాల మధ్య పోరు సాగుతోంది. ముంబయిలో మే 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది. శివసేన, ఎన్సీపీల్లో చీలికల తర్వాత జరుగుతున్న అతి పెద్ద ఎన్నికలివే. ఇటీవల ఆంధేరీ ఈస్ట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగినా శిందే శివసేన, భాజపా పోటీ చేయలేదు.

ముంబయి నగరంలో 24 లక్షల మంది ఓటర్లున్నారు. సబర్బన్‌లో 74 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.


పోటీలో ఎవరెవరు?

  • దక్షిణ ముంబయిలో ఉద్ధవ్‌ వర్గానికి చెందిన అరవింద్‌ సావంత్‌, శిందే వర్గానికి చెందిన యామిని జాదవ్‌ తలపడుతున్నారు.
  • దక్షిణ మధ్య ముంబయిలో ఉద్ధవ్‌ వర్గానికి చెందిన అనిల్‌ దేశాయ్‌, శిందే వర్గానికి చెందిన రాహుల్‌ శెవాలే పోటీ పడుతున్నారు. - వాయవ్య ముంబయిలో ఉద్ధవ్‌ వర్గానికి చెందిన అమోల్‌ కీర్తికర్‌, శిందే వర్గానికి చెందిన రవీంద్ర వైకర్‌ తలపడుతున్నారు.  
  • ఉత్తర మధ్య ముంబయిలో కాంగ్రెస్‌ నుంచి వర్షా గైక్వాడ్‌, భాజపా తరఫున న్యాయవాది ఉజ్వల్‌ నికం పోటీ చేస్తున్నారు. - ఉత్తర ముంబయిలో భాజపా తరఫున కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, కాంగ్రెస్‌ తరఫున భూషణ్‌ పాటిల్‌ పోటీ పడుతున్నారు. - ఈశాన్య ముంబయిలో భాజపా నుంచి మిహిర్‌ కొటెకా, ఉద్ధవ్‌ పార్టీ నుంచి సంజయ్‌ దినా పాటిల్‌ పోటీ చేస్తున్నారు.

తొలిసారి కాంగ్రెస్‌కు ఓటేయనున్న ఠాక్రే

బాంద్రాలో ఉంటున్న ఉద్ధవ్‌ ఠాక్రే తొలిసారిగా కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేయనున్నారు. ఆయన ఉంటున్న ప్రాంతం కాంగ్రెస్‌ తరఫున వర్షా గైక్వాడ్‌ పోటీ చేస్తున్న ఉత్తర మధ్య ముంబయి నియోజకవర్గంలోకి వస్తుంది.


శివసేనల మధ్య పోటీ జరగనున్న స్థానాలు

  • దక్షిణ ముంబయి
  • దక్షిణ మధ్య ముంబయి
  • వాయవ్య ముంబయి

భాజపా, ఉద్ధవ్‌ పార్టీల మధ్య..

ఈశాన్య ముంబయి

భాజపా, కాంగ్రెస్‌ మధ్య..

  • ఉత్తర ముంబయి
  • ఉత్తర మధ్య ముంబయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img