icon icon icon
icon icon icon

గుర్తుల లోడింగ్‌ యూనిట్ల నిల్వకు కొత్త ప్రొటోకాల్‌

గుర్తుల లోడింగ్‌ యూనిట్ల (ఎస్‌ఎల్‌యూ) నిర్వహణ, నిల్వకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) నూతన ప్రొటోకాల్‌ను తీసుకొచ్చింది.

Published : 02 May 2024 04:39 IST

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూపొందించిన ఈసీ

దిల్లీ: గుర్తుల లోడింగ్‌ యూనిట్ల (ఎస్‌ఎల్‌యూ) నిర్వహణ, నిల్వకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) నూతన ప్రొటోకాల్‌ను తీసుకొచ్చింది. ఓటింగ్‌ అనంతరం ఎస్‌ఎల్‌యూలను సీల్‌ చేసి, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత కనీసం 45 రోజులపాటు ఈవీఎంలతోపాటు వాటిని స్ట్రాంగ్‌రూంలలో భద్రంగా ఉంచనున్నట్లు ప్రకటించింది. అందుకోసం అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటుచేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను బుధవారం ఓ ప్రకటనలో ఆదేశించింది. గత నెల 26న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ ప్రొటోకాల్‌ను ఈసీ రూపొందించింది. ఇంతకుముందు- ఓటింగ్‌ ముగిసిన మరుసటి రోజే ఎస్‌ఎల్‌యూలను పోలింగ్‌ అధికారులు ప్రభుత్వరంగ సంస్థలైన బెల్‌ లేదా ఈసీఐఎల్‌ ఇంజినీర్లకు తిరిగి అప్పగించేవారు.

ఉత్సాహంగా ఓటేస్తున్న పీవీటీజీలు

అత్యంత దుర్బల గిరిజన తెగల (పీవీటీజీ) ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేలా గత రెండేళ్లలో తాము చేసిన కృషి సత్ఫలితాలనిస్తోందని ఈసీ బుధవారం తెలిపింది. ఈ వర్గాల సభ్యులు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారని వెల్లడించింది. వారికి అందుబాటులో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయడం బాగా కలిసొచ్చిందని పేర్కొంది. గ్రేట్‌ నికోబార్‌లోని షోంపెన్‌ తెగవారు తొలిసారి ఈ ఎన్నికల్లోనే ఓటేశారని తెలిపింది. మన దేశంలో గిరిజన జనాభా 8.6% ఉంది. మొత్తం 75 తెగలను పీవీటీజీలుగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img