icon icon icon
icon icon icon

ఎవరూ భయపడటం లేదు.. అమేఠీ, రాయ్‌బరేలీపై నేడు నిర్ణయం: కాంగ్రెస్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరనేది 24 నుంచి 30 గంటల్లో ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు.

Published : 02 May 2024 04:39 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరనేది 24 నుంచి 30 గంటల్లో ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు భయపడుతున్నారని వస్తున్న విమర్శలపై బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన స్పందించారు. ‘‘అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చేయాలనే నిర్ణయాధికారాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఇప్పటికే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించింది. ఇక్కడ ఎవరూ భయపడటం లేదు.. పారిపోవడం లేదు. జాప్యమేమీ లేదు. 3వ తేదీ వరకు సమయం ఉంది. చర్చలు జరుగుతున్నాయి. ఖర్గే ఒక నిర్ణయానికి వచ్చేవరకు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు’’ అని కోరారు.

రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌?

రాహుల్‌ ఈసారి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, తుది నిర్ణయాన్ని సోనియా కుటుంబం ఇంకా తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాల సమాచారం. ప్రియాంక కూడా అదేచోట నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారని, రాహుల్‌ మాత్రం ఆ ప్రతిపాదనకు సానుకూలంగా లేరని అంటున్నారు. గాంధీ కుటుంబం నుంచి ముగ్గురు సభ్యులు పార్లమెంటులో ఉండడాన్ని ఆయన కోరుకోవడం లేదని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. బుధవారం ఒక సమావేశం జరిగినా తుది నిర్ణయానికి రాలేకపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img