icon icon icon
icon icon icon

ఓటమి భయంతో హుందాతనాన్ని మరచిన మోదీ

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కూటమికి ఓటమి అనివార్యమని తేలిపోవడంతో ప్రధాని మోదీ నిరాశా నిస్పృహలకు లోనై ఆ పదవి హుందాతనాన్ని మరచిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.

Published : 02 May 2024 04:40 IST

రాహుల్‌గాంధీ ధ్వజం

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కూటమికి ఓటమి అనివార్యమని తేలిపోవడంతో ప్రధాని మోదీ నిరాశా నిస్పృహలకు లోనై ఆ పదవి హుందాతనాన్ని మరచిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. మహిళల మంగళసూత్రాలను, ప్రజల ఇంటి నుంచి గదులను, గేదెలను లాక్కొనిపోతారని ఏవేవో అర్థంపర్థం లేని మాటలు చెబుతున్నారని ‘ఎక్స్‌’లో ధ్వజమెత్తారు. తదుపరి ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఏర్పాటు చేయడం ఖాయమని తెలిశాక మోదీ ఒక అబద్ధాల యంత్రంలా తయారయ్యారని చెప్పారు. కోటీశ్వరులైన స్నేహితుల కోసం మోదీ సర్కారు వృథా చేసిన డబ్బును ఇండియా కూటమి సర్కారు తిరిగి ప్రజలకు ఇస్తుందని తెలిపారు. కర్ణాటకలో మహిళలపై హేయమైన అఘాయిత్యాల విషయంలో ఎప్పటిమాదిరిగానే మోదీ నిస్సిగ్గుగా మౌనం దాల్చారని, ‘మోదీ రాజకీయ కుటుంబం’లో ఉన్నవారు నేరగాళ్లయినా వారికి రక్షణ మాత్రం ‘గ్యారంటీ’గా లభిస్తుందని విమర్శించారు. అనేక ఘటనల్లో నేరగాళ్లకు ప్రధాని మౌనంగా అండగా నిలుస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img