icon icon icon
icon icon icon

సర్వేలు, పథకాల లబ్ధి సాకుతో ఓటర్ల వివరాల సేకరణపై ఈసీ ఆగ్రహం

ఎన్నికల అనంతరం వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామంటూనో, సర్వేల సాకుతోనో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 03 May 2024 06:02 IST

పార్టీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

దిల్లీ: ఎన్నికల అనంతరం వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామంటూనో, సర్వేల సాకుతోనో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రకటనల ద్వారా, మొబైల్‌ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయటంతో పాటు ఆ విధానాన్ని వీడాలని తెలిపింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గురువారం హెచ్చరించింది. చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే సర్వేల మధ్య ఉండే విభజన రేఖను కొన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చెరిపివేసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఈసీ పేర్కొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇటువంటివన్నీ అవినీతికి పాల్పడడంగానే పరిగణిస్తామని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు పంపించిన సూచనల్లో వివరించింది. ఈ తరహా అనైతిక చర్యలపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులనూ ఈసీ ఆదేశించింది. ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లపై ప్రచురణ కర్తలు, ముద్రణదారుల పేర్లు, చిరునామా లేకపోతే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img