icon icon icon
icon icon icon

ప్రతి భారతీయుడూ కాంగ్రెస్‌ ఓటుబ్యాంకే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఎదురుదాడికి దిగారు.

Updated : 03 May 2024 06:40 IST

ప్రధాని మోదీకి లేఖలో ఖర్గే

దిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఎదురుదాడికి దిగారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తరువాత ప్రజలంతా మోదీని అనివార్యమైన ఓటమిని తప్పించుకునేందుకు ‘‘విభజన, అసత్యాలతో కూడిన మతతత్త్వ ప్రసంగాలు చేసిన వ్యక్తి’’గా మాత్రమే గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు తొలగించి కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు వాటిని కల్పిస్తారంటూ ఎన్‌డీయే లోక్‌సభ అభ్యర్థులకు మోదీ రాసిన లేఖపై స్పందిస్తూ.. ప్రతి భారతీయుడు మా ఓటు బ్యాంకే..పేదలు, వివక్షకు గురైనవారు, మహిళలు, ఆకాంక్షలతో ఉన్న యువత, శ్రామికులు, దళితులు, ఆదివాసీలంతా తమ ఓటు బ్యాంకేనని ఖర్గే పేర్కొన్నారు. ఈ మేరకు మోదీకి ఓ లేఖ రాశారు. అందులో ద్వేషపూరిత ప్రసంగాలకు బదులు గత పదేళ్లలో ఎన్‌డీయే సర్కార్‌ పనితీరు ఆధారంగా ఓట్లు అడగడం మంచిదని ప్రధానికి సూచించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ నిరాశతో ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఒక అబద్ధాన్ని వెయ్యి సార్లు పునరావృతం చేసినా అది నిజం అయిపోదు...మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ ఏ హామీలిచ్చిందో చదివి అర్థం చేసుకోగల స్థాయి ఓటర్లకు ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img