icon icon icon
icon icon icon

కురుక్షేత్ర భాజపా అభ్యర్థి నవీన్‌ జిందాల్‌ ఆస్తులు.. రూ.వెయ్యి కోట్లు

హరియాణాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ (54) గురువారం తన నామినేషను పత్రాలు దాఖలు చేశారు.

Published : 03 May 2024 04:41 IST

చండీగఢ్‌: హరియాణాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ (54) గురువారం తన నామినేషను పత్రాలు దాఖలు చేశారు. భార్య శాలూ జిందాల్‌తోపాటు తన పేరిట స్థిర, చరాస్తులు రూ.1,000 కోట్ల మేర ఉన్నట్లు ఆయన నామపత్రాల్లో ప్రకటించారు. అయితే, తామిద్దరికీ సొంత వాహనం లేదని పేర్కొనడం విశేషం. మరోవైపు.. కురుక్షేత్రలో నవీన్‌ జిందాల్‌ ప్రత్యర్థిగా నామినేషను దాఖలు చేసిన ఆప్‌ అభ్యర్థి సుశీల్‌గుప్తా తన భార్యతోపాటు తన పేరిట మొత్తం రూ.169 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ప్రకటించారు. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ కంపెనీ ఛైర్మన్‌ అయిన నవీన్‌ జిందాల్‌ వెంట హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైనీ నామినేషను దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ స్థానం నుంచి ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థిగా అభయ్‌సింగ్‌ చౌటాలా కూడా బరిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img