icon icon icon
icon icon icon

బ్రిజ్‌ భూషణ్‌ను పక్కనపెట్టిన భాజపా

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు ఈ లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ దొరుకుతుందా? లేదా? అన్న ప్రశ్నకు తెరపడింది.

Published : 03 May 2024 04:42 IST

కైసర్‌గంజ్‌లో ఆయన కుమారుడు కరణ్‌కు టికెట్‌

దిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు ఈ లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ దొరుకుతుందా? లేదా? అన్న ప్రశ్నకు తెరపడింది. బ్రిజ్‌ భూషణ్‌ను భాజపా అధిష్ఠానం పక్కన పెట్టింది. అయితే ఆ స్థానంలో ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ను బరిలో దింపింది. కమలం పార్టీ గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో కైసర్‌గంజ్‌ టికెట్‌ను సిటింగ్‌ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌కు బదులుగా ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌కు ఇచ్చింది. మరోవైపు గాంధీ కుటుంబం కంచుకోట అయిన రాయ్‌బరేలీలో అభ్యర్థిగా దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ను ప్రకటించింది. గత ఎన్నికల్లో ఆయన సోనియా గాంధీ ప్రత్యర్థిగా నిలిచి ఓటమిపాలయ్యారు. ఈ రెండు స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img