icon icon icon
icon icon icon

నాకు ఎన్ని ఓట్లు వస్తే అన్ని మొక్కలు నాటుతా

పశ్చిమ బెంగాల్‌లోని ఘటల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రముఖ బెంగాలీ నటుడు దేవ్‌ అలియాస్‌ దీపక్‌ అధికారి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 03 May 2024 06:16 IST

బెంగాలీ నటుడు దేవ్‌ ప్రకటన

ఘటల్‌: పశ్చిమ బెంగాల్‌లోని ఘటల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రముఖ బెంగాలీ నటుడు దేవ్‌ అలియాస్‌ దీపక్‌ అధికారి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని ఆశిస్తున్నారు. ఉదయం నామినేషన్‌కు ముందు దేవ్‌ రక్తదానం చేశారు. దాతల కొరతతో రక్తనిధి కేంద్రాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో తనకు వచ్చే ఓట్లకు సమాన సంఖ్యలో మొక్కలు నాటుతానని ప్రకటించారు. ఏటేటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఘటల్‌లో ఈ నెల 25న ఓటింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img