icon icon icon
icon icon icon

రాజ్‌పూత్‌లను శాంతపరిచేందుకు మోదీ కృషి

గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌కోట్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలపై ఆగ్రహంతో ఉన్న రాజ్‌పూత్‌ (క్షత్రియ) వర్గాన్ని శాంతపరిచే చర్యలకు పూనుకున్నారు.

Updated : 03 May 2024 06:36 IST

జామ్‌నగర్‌ రాజకుటుంబంతో భేటీ

జామ్‌నగర్‌: గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌కోట్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలపై ఆగ్రహంతో ఉన్న రాజ్‌పూత్‌ (క్షత్రియ) వర్గాన్ని శాంతపరిచే చర్యలకు పూనుకున్నారు. గురువారం జామ్‌నగర్‌ రాజకుటుంబంతో భేటీ అయిన ప్రధాని రాజ్‌పూత్‌ వర్గీయుల త్యాగాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా నవానగర్‌ మహారాజా జామ్‌సాహెబ్‌ శతృశల్య్‌సింగ్‌ తన తలపై రాచ పగిడీ అలంకరించిన చిత్రాలను ప్రధాని ‘ఎక్స్‌’ ద్వారా షేర్‌ చేశారు. ఈ భేటీ అనంతరం తలపాగాతో అలాగే జామ్‌నగర్‌ ర్యాలీకి హాజరైన మోదీ చరిత్రలో రాజ్‌పూత్‌లు చేసిన త్యాగాలను అభినందనలతో ముంచెత్తారు. పూర్వకాల మహారాజులు బ్రిటిషర్ల ఒత్తిడికి లొంగిపోయి, తమ కుమార్తెలను కూడా వారికిచ్చి పెళ్లిళ్లు జరిపించారని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల చేసిన వ్యాఖ్యలు ఆయనపై రాజ్‌పూత్‌ల ఆగ్రహానికి కారణమయ్యాయి. తమ డిమాండు మేరకు భాజపా రాజ్‌కోట్‌ అభ్యర్థిత్వం నుంచి రూపాలను తొలగించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజ్‌పూత్‌లు అందరూ ఏకమయ్యారు. నాలుగు ‘మహా సమ్మేళనాలు’ నిర్వహించిన వీరు గుజరాత్‌లోని కనీసం 10 స్థానాల్లో భాజపాను ఓడించాలని తీర్మానించారు. వీరిని శాంతపరిచేందుకు చివరి అంకంలో ప్రధాని చూపిన చొరవ ఏమేరకు ప్రభావం చూపనుందో ఈ నెల 7న జరగనున్న పోలింగుతో తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img