icon icon icon
icon icon icon

ముందుగా చెప్పకుండానే అవకాశం..

కొన్నేళ్ల క్రితం ఓ యువకుడు తన సంగీతం, రచనలతో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు.

Published : 03 May 2024 06:17 IST

మన్‌ కీ బాత్‌ కుర్రాడు హేమంగ్‌ జోషీకి వడోదర టికెట్‌ ఇచ్చిన భాజపా

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్నేళ్ల క్రితం ఓ యువకుడు తన సంగీతం, రచనలతో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు. ఆయనే హేమంగ్‌ జోషీ. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా వడోదర టికెట్‌ ఇవ్వడంతో ఒక్కసారి వార్తల్లో నిలిచారు. గుజరాత్‌లోనే అత్యంత పిన్న వయసులో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థిగా ఘనత సాధించారు. హేమంగ్‌ గుజరాత్‌లో సానెడో అనే ఓ రకమైన జానపద డ్రామాలు రాసేవారు. పరిశుభ్రతే ఇతివృత్తంగా సాగిన ఆయన సృజనాత్మక కార్యక్రమాలు వేగంగా గుర్తింపు పొందాయి. 2016 జులైలో ‘మన్‌కీ బాత్‌’లో ప్రధాని మోదీ అతడి ప్రతిభను ప్రస్తావించారు. మరోవైపు, ఈ ఏడాది హోలీ వేడుకల్లో ఉండగా హేమంగ్‌ జోషీ ఫోన్‌కు అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. భాజపా సిటింగ్‌ ఎంపీ రంజన్‌భట్‌ ను కాదని వడోదర టికెట్‌ను పార్టీ అధిష్ఠానం ఆయనకు కేటాయించడమే ఇందుకు కారణం. ఒకప్పుడు వడోదర నుంచే ప్రధాని మోదీ పోటీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img