icon icon icon
icon icon icon

రాజ్యాంగ మౌలిక సూత్రాల్నిఏ పార్టీ, నాయకుడూ మార్చలేరు: గడ్కరీ

భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకికతత్వం, ప్రాథమిక హక్కులు వంటి వాటిని  పార్లమెంటు సహా ఏ పార్టీ, నాయకుడూ మార్చలేరని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

Updated : 04 May 2024 06:27 IST

పుణె: భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకికతత్వం, ప్రాథమిక హక్కులు వంటి వాటిని  పార్లమెంటు సహా ఏ పార్టీ, నాయకుడూ మార్చలేరని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా ప్రణాళికలు రచిస్తోందన్న కాంగ్రెస్‌ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపాడేశారు. పశ్చిమ మహారాష్ట్రలోని మాన్‌ తహసీల్‌లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనేకసార్లు రాజ్యాంగాన్ని సవరించిందని గుర్తుచేశారు. ‘‘డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ వారు ప్రచారం చేస్తున్నారు. కానీ, రాజ్యాంగాన్ని మార్చలేం’’ అని స్పష్టంచేశారు. ‘‘భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం సహా రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఏ నాయకుడు, పార్టీ లేదా పార్లమెంటు సవరించలేదని సుప్రీంకోర్టు రూలింగ్‌ ఇచ్చింది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img