icon icon icon
icon icon icon

రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తారా?

దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లను తొలగించాలనేది ‘భాజపా-ఆరెస్సెస్‌’ల స్పష్టమైన దీర్ఘకాల లక్ష్యమని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని తొలగిస్తారా?

Updated : 04 May 2024 06:20 IST

ప్రధాని మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్‌

దిల్లీ: దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లను తొలగించాలనేది ‘భాజపా-ఆరెస్సెస్‌’ల స్పష్టమైన దీర్ఘకాల లక్ష్యమని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని తొలగిస్తారా? లేదా? అని ప్రధాని మోదీని నిలదీసింది. మోదీ ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష ఆయనలో చెలరేగిన భయాందోళనలకు నిదర్శనమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 శాతం మించి కల్పించేందుకు రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్‌ తప్పక కృషి చేస్తుందని ‘ఎక్స్‌’లో స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img