icon icon icon
icon icon icon

లాలూ కుమార్తెపై లాలూ పోటీ!

ఆర్జేడీ కంచుకోట, గతంలో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహించిన సారణ్‌ నుంచి ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య ఈసారి పోటీలో ఉన్నారు.

Published : 04 May 2024 06:12 IST

పట్నా: ఆర్జేడీ కంచుకోట, గతంలో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహించిన సారణ్‌ నుంచి ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య ఈసారి పోటీలో ఉన్నారు. అదే స్థానం నుంచి రాష్ట్రీయ జన సంభావన పార్టీ నుంచి లాలూప్రసాద్‌ యాదవ్‌ అన్న పేరున్న వ్యక్తి బరిలో ఉన్నారు. ఏప్రిల్‌ 26న నామినేషన్‌ వేశారు. దాంతో రోహిణి, లాలూల మధ్య పోటీ నెలకొంది. అయితే ఇలా ఎన్నికల్లో పోటీ చేయడం ఈ లాలూకు కొత్తేం కాదు. సారణ్‌లోని రహిమ్‌పుర్‌ గ్రామానికి చెందిన ఆయన వ్యవసాయం చేస్తూనే సామాజిక సేవలో పాల్గొంటున్నారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పేరే కలిగి ఉండి గతంలోను పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేయడంతో చాలామంది గందరగోళానికి గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img