icon icon icon
icon icon icon

శివసేన గూటికి తిరిగొచ్చిన మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌

కాంగ్రెస్‌ బహిష్కృత నేత, మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌ (59) మళ్లీ శివసేన (శిందే) గూటికి చేరారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే సమక్షంలో శుక్రవారం ఆయన శివసేన పార్టీ కండువా కప్పుకొన్నారు.

Updated : 04 May 2024 06:43 IST

ఠాణె: కాంగ్రెస్‌ బహిష్కృత నేత, మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌ (59) మళ్లీ శివసేన (శిందే) గూటికి చేరారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే సమక్షంలో శుక్రవారం ఆయన శివసేన పార్టీ కండువా కప్పుకొన్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం అవిభాజ్య శివసేన నుంచి బయటకువచ్చిన సంజయ్‌.. తిరిగి పాత గూటికి చేరారు. సంజయ్‌ గతంలో ఉత్తర ముంబయి నుంచి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్‌.. ఉద్ధవ్‌ వర్గం శివసేనతో చేసుకొన్న సీట్ల సర్దుబాటును వ్యతిరేకించిన ఈయన పార్టీపై విమర్శలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సంజయ్‌ నిరుపమ్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఆరేళ్లపాటు బహిష్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img