icon icon icon
icon icon icon

మోతీలాల్‌ నెహ్రూపై కంగన అనుచిత వ్యాఖ్యలు

భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తండ్రి మోతీలాల్‌ నెహ్రూను అంబానీతో పోలుస్తూ బాలీవుడ్‌ నటి, భాజపా లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.

Updated : 05 May 2024 06:48 IST

ఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్‌

శిమ్లా: భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తండ్రి మోతీలాల్‌ నెహ్రూను అంబానీతో పోలుస్తూ బాలీవుడ్‌ నటి, భాజపా లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. హిమాచల్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆమె శనివారం సర్కాఘాట్‌ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...మోతీలాల్‌ ఆనాటి అంబానీ అని వ్యాఖ్యానించారు. మోతీలాల్‌కు అంత డబ్బు, ఆస్తులు ఎలా వచ్చాయన్నది ఇప్పటికీ రహస్యమేనని, కానీ ఆయన బ్రిటిషు వారితో అత్యంత సన్నిహితంగా ఉండేవారని అన్నారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు అనుకూలంగా ఓటింగ్‌ ఉన్నా అప్పటికప్పుడు జవహర్‌లాల్‌ ఎలా ప్రధాని అయ్యారో ఎవ్వరికీ తెలియదని, అప్పటినుంచే వారసత్వ పాలన అనే చెదపురుగు దేశానికి సోకిందని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన హిమాచల్‌ కాంగ్రెస్‌ పార్టీ..మోతీలాల్‌ నెహ్రూపై కంగన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఒక స్వాతంత్య్ర సమరయోధుడిని వ్యాపారవేత్తతో పోల్చడం అవమానకరమని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇలా మరణించిన వ్యక్తులపై వ్యక్తిగతంగా దాడికి దిగడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img