icon icon icon
icon icon icon

10 వేలమంది అనుచరులతో సభ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున పోటీచేస్తున్న కరణ్‌ భూషణ్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలుచేశారు.

Published : 05 May 2024 05:09 IST

కుమారుడి నామినేషన్‌ వేళ బ్రిజ్‌భూషణ్‌ హడావుడి

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున పోటీచేస్తున్న కరణ్‌ భూషణ్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలుచేశారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ ఈ సందర్భంగా తనకున్న పట్టును ప్రదర్శించారు. తన అనుచరగణంతో హడావుడి చేశారు. నామినేషన్‌కు ముందు నిర్వహించిన సభకు 10 వేలమంది హాజరయ్యారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్‌లు, భాజపా స్థానిక నేతలు, అయోధ్యలోని ప్రముఖ అఖాడాలకు చెందిన పెద్దలు ఉన్నారు. 500-700 వరకు ఎస్‌యూవీలు మైదానంలో నిలిపి ఉంచినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక వేదికపై అంతా కుర్చీల్లో కూర్చోగా.. బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం మధ్యలో ఒక సోఫాలో కూర్చున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో తన కుమారుడు, అలాగే యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్యకు మాత్రం ఆయన దూరంగా ఉన్నారు. అలాగే కరణ్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించేటప్పుడు కూడా కార్యాలయం లోపలకు వెళ్లలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img