icon icon icon
icon icon icon

ప్రజలతో సంబంధాలు తెగిపోయిన చక్రవర్తి మోదీ

కాంగ్రెస్‌ అగ్ర నేత, తన సోదరుడు రాహుల్‌ గాంధీని ‘యువరాజు’గా పేర్కొంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఆ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ వాద్రా దీటుగా బదులిచ్చారు.

Published : 05 May 2024 05:12 IST

ప్రధానిపై ప్రియాంకాగాంధీ విమర్శ

లఖానీ (గుజరాత్‌): కాంగ్రెస్‌ అగ్ర నేత, తన సోదరుడు రాహుల్‌ గాంధీని ‘యువరాజు’గా పేర్కొంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఆ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ వాద్రా దీటుగా బదులిచ్చారు. మోదీని ప్రజలతో సంబంధాలు తెగిపోయిన చక్రవర్తిగా ఆమె అభివర్ణించారు. గుజరాత్‌లోని బనాస్‌కాంఠా లోక్‌సభ స్థానంలో శనివారం నిర్వహించిన ప్రచార ర్యాలీలో ప్రియాంక ప్రసంగించారు. తమ ‘యువరాజు’ దేశ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారంటూ ‘జోడో యాత్ర’ను గుర్తుచేశారు. రైతులు, కూలీలను కలిసి.. వారి సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ప్రయత్నించారని అన్నారు. మోదీ చక్రవర్తి మాత్రం కోటలోనే ఉంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘‘ప్రధానిని ఎప్పుడైనా టీవీలో చూశారా? దుస్తులు, జుట్టు చెక్కుచెదరకుండా రాజులా కనిపిస్తారు. అలాంటి వ్యక్తికి ప్రజల కష్టం, సమస్యలు ఏం అర్థమవుతాయి? అందుకే మనమంతా ద్రవ్యోల్బణంతో ఇబ్బందిపడుతున్నాం’’ అని ప్రియాంక పేర్కొన్నారు. 

కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు సరైన తరుణమిదే

దావణగెరె (కర్ణాటక): ప్రధానమంత్రి పీఠానికి ఉన్న గౌరవాన్ని మోదీ తగ్గించారని ప్రియాంకాగాంధీ విమర్శించారు. దేశ రాజకీయాలను సరిదిద్దడం కోసం కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు సరైన తరుణమిదేనని పేర్కొన్నారు. కర్ణాటకలోని దావణగెరెలో శనివారం నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆమె ప్రసంగించారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో జేడీ(ఎస్‌) నుంచి సస్పెండయిన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు మద్దతుగా మోదీ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img