icon icon icon
icon icon icon

మేం మంగళసూత్రాలు లాక్కొనేంత దుష్టులమా?

ధికారంలో ఉండడం కోసం హిందువుల్లో భయం సృష్టించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ఆరోపించారు.

Published : 05 May 2024 05:13 IST

హిందువుల్లో భయం కలిగించేందుకు మోదీ ప్రయత్నం : ఫరూక్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌: అధికారంలో ఉండడం కోసం హిందువుల్లో భయం సృష్టించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ఆరోపించారు. ‘మహిళల మంగళసూత్రాలను లాక్కొనిపోయి ముస్లింలకు ఆ డబ్బు ఇచ్చేస్తారని మోదీ చెబుతున్నారు. మేం మా తల్లులు, సోదరీమణుల మంగళసూత్రాలను లాక్కొనేటంత దుష్టులమా?’ అని ప్రశ్నించారు. శనివారం శ్రీనగర్‌లో ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచి అధికారంలోకి వస్తే హిందువుల పొదుపు మొత్తాలపై పన్ను పడుతుందని, వారికి రెండు ఇళ్లు ఉన్నట్లయితే ఒకదానిని తీసుకుని ముస్లింలకు ఇచ్చేస్తారని మోదీ చెబుతున్నారు. ముస్లింల పట్ల హిందువుల్లో ద్వేషాన్ని కలిగిస్తున్నారు. ముస్లింలకు ఎక్కువమంది పిల్లలు ఉంటారని ఆయన చెబుతున్నారు. సంతానమే లేని ఆయనకు పిల్లల గురించి ఏం తెలుసు? తన సొంత భార్యకూ ఆయన విలువ ఇవ్వరు. ఇక పిల్లలకు ఏం విలువనిస్తారు?’ అని అబ్దుల్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img