icon icon icon
icon icon icon

రాయ్‌బరేలీలో రాహుల్‌ ఓటమి ఖాయం: అమిత్‌ షా

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు స్థానాల నుంచి బరిలో దిగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శలు గుప్పించారు.

Published : 05 May 2024 05:28 IST

బొడేలీ, వంసదా (గుజరాత్‌): ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు స్థానాల నుంచి బరిలో దిగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. రాయ్‌బరేలీలో రాహుల్‌ భారీ తేడాతో ఓడిపోవడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పుర్‌ జిల్లా బొడేలీ పట్టణంలో శనివారం నిర్వహించిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘‘2019 నాటి ఎన్నికల్లో అమేఠీలో ఓడిపోవడం ఖాయమని తేలడంతో రాహుల్‌ వయనాడ్‌లోనూ పోటీ చేశారు. ఇప్పుడు వయనాడ్‌లో పరాజయం తప్పదని గ్రహించి రాయ్‌బరేలీ బరిలో దిగారు. రాహుల్‌ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. సమస్య ఆయనలోనే ఉంది తప్ప.. సీట్లలో కాదు’’ అని పేర్కొన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని అమిత్‌ షా తీవ్రంగా విమర్శించారు. దాన్ని ‘అర్బన్‌ నక్సల్‌ పార్టీ’గా పేర్కొన్నారు. గుజరాత్‌లోని వంసదాలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img