icon icon icon
icon icon icon

సందేశ్‌ఖాలీ కుట్ర బయటపడింది: మమత

పశ్చిమబెంగాల్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే సందేశ్‌ఖాలీ ఘటనలపై భాజపా అసత్య ప్రచారం చేసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.

Updated : 06 May 2024 07:00 IST

బోల్పుర్‌: పశ్చిమబెంగాల్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే సందేశ్‌ఖాలీ ఘటనలపై భాజపా అసత్య ప్రచారం చేసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. డబ్బుల ఆశ చూపి టీఎంసీ నాయకులపై ఆరోపణలు చేయించేందుకు కుట్రపన్నిందని, ఓటర్లను మభ్యపెట్టేందుకు యత్నించిందని దుమ్మెత్తిపోశారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోతో వారి కుట్ర బయటపడిందని.. ఇకనైనా ప్రధాని మోదీ మొసలి కన్నీరు కార్చడం మానాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఆమె బోల్పుర్‌ స్థానంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చి అబద్ధాలకు భాజపా పెట్టింది పేరని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img